Bhopal: సహాయం చేసేందుకు వెళ్లి.. 13 నెలలు జైలు జీవితం గడిపాడు.. భోపాల్‌లో ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 29 , 2025 | 08:01 PM
అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు. భోపాల్‌లోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. భోపాల్‌లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు.

అతడు మానవత్వం (Humanity)తో ఎదుటి మనిషికి సహాయం చేద్దామనుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న మహిళను హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. అయితే అతడి మానవత్వమే అతడి కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు (13 Months In Jail) జీవితం గడిపేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు. భోపాల్‌లోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. భోపాల్ (Bhopal)లోని స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు.
గతేడాది జూన్‌లో రాజేశ్ ఎదురింటి మహిళ అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో రాజేశ్ ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేశాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాజేశ్ భయపడుతూ సమాధానాలు చెప్పాడు. రాజేశ్ తడబడుతుండడంతో అతడే ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు భావించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఆమెది హత్య అని, రాజేశ్ ఆమెను గొంతు కోసి చంపేశాడని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. అతడి అరెస్ట్ గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
రాజేశ్ పేదవాడు కావడంతో అతడు తన తరఫున లాయర్‌ను పెట్టుకోలేకపోయాడు. దీంతో కోర్టు అతడి కేసును ప్రభుత్వ న్యాయవాదికి అప్పగించింది. రంగంలోకి దిగిన న్యాయవాది రాజేశ్‌ను కలుసుకుని ప్రశ్నించాడు. ఆమెను తాను చంపలేదని, అనారోగ్యంతో ఉన్న ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానని లాయర్‌కు చెప్పాడు. మెడికల్ రిపోర్ట్‌లో కూడా ఆమె అనారోగ్యంతోనే మృతి చెందిందని ఉండడంతో లాయర్ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. కేసు క్లోజ్ చేయడం కోసం పోలీసులు అలా చేశారని తెలిసింది.
ఆమె మరణంలో రాజేశ్ పాత్ర లేదని తేలడంతో న్యాయస్థానం అతడిని విడుదల చేసింది. 13 నెలల జైలు జీవితం తర్వాత విడుదలైన రాజేశ్ జీవితం మరింత దుర్భరంగా మారింది. తన కుటుంబం రోడ్డున పడిందని, తాను జైలుకు వెళ్లానని తెలిసి ఎవరూ పని ఇవ్వడం లేదని రాజేశ్ వాపోతున్నాడు. 13 నెలల క్రితం పోలీసులు తన ఇంటికి తాళం వెయ్యడంతో అప్పట్నుంచి ఇంటికి అద్దె చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..