Man Pushes Wife from Roof: కోరిక తీర్చలేదని భార్యపై భర్త దారుణం..
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:41 PM
భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో భర్త సైకోలా మారిపోయాడు. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మేడపై నుంచి కిందకు తోసేశాడు.
భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్యావరి గ్రామానికి చెందిన తీజ, ముఖేష్ ప్రేమించుకున్నారు. తరచుగా ఏకాంతంగా కలిసేవారు.
ఈ నేపథ్యంలోనే ఓ రోజు గ్రామస్తులకు దొరికిపోయారు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు వీరికి పెళ్లి చేశారు. 2022లో తీజ, ముఖేష్‌ల పెళ్లి జరిగింది. ఓ ఏడాది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. ముఖేష్ ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం గడిపేవాడు. రాత్రిళ్లు బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో గొడవ పెట్టుకునేవాడు. రెండు రోజుల క్రితం తన కోరిక తీర్చాలంటూ ముఖేష్ భార్యతో గొడవపెట్టుకున్నాడు.
ఆమె ఒప్పుకోకపోయే సరికి బాగా కొట్టాడు. కోరిక తీర్చాలంటూ మంగళవారం కూడా భార్యను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోయే సరికి ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను మేడపై నుంచి కిందకు తోసేశాడు. 30 అడుగుల పైనుంచి కిందపడ్డ తీజ తీవ్ర గాయాలపాలైంది. నొప్పి భరించలేక గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న గ్రామస్తులు అక్కడికి వచ్చారు. గాయపడ్డ తీజను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై చర్యలకు సిద్ధం అయ్యారు.
ఇవి కూడా చదవండి
జిమ్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్.. కంటి చూపు కోల్పోయిన యువకుడు..
మొంథా తుపాన్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు