Instagram Lady: భార్యను కాదని ఆమె వద్దకు వెళ్లాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:10 PM
కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆమె మోజులో పడి అతడు భార్యను దూరం చేసుకున్నాడు. భార్యను కాదని, ప్రియురాలితో వెళ్లి పోయిన ఆ వ్యక్తి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది.

సోషల్ మీడియా జనాలకు ఎంతగా ఉపయోగపడుతోందో.. అంతకు మించి అనర్థాలకు దారి తీస్తోంది. సోషల్ మీడియా ద్వారా అవుతున్న పరిచయాలు దారుణాలకు తెర తీస్తున్నాయి. పెళ్లి కాని వారి సంగతి పక్కన పెడితే.. పెళ్లయిన వారు కూడా తప్పుడు బంధాల్లో ఇరుక్కుపోతున్నారు. కొత్త పరిచయాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. సోషల్ మీడియా కారణంగా ఏర్పడ్డ అక్రమ సంబంధాల వల్ల దేశ వ్యాప్తంగా నిత్యం ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఇదే కోవలో తాజాగా, కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. భార్యను కాదని, ప్రియురాలి కోసం సాహసం చేయటం విషాదంగా ముగిసింది. ప్రియురాలే ఆస్తి కోసం అతడి ప్రాణాలు తీసేసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భార్యను కాదని ప్రియురాలి కోసం..
మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దొరైస్వామి అలియాస్ సూర్యది మైసూరు తాలూకాలోని అనుగనహళ్లి గ్రామం. ఇతడికి ఆరు సంవత్సరాల క్రితం హింకల్‌కు చెందిన దీపికతో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్యకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్వేత అనే మహిళ పరిచయం అయింది. కొన్ని నెలలకు ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో సూర్య, దీపికల మధ్య గొడవలు జరిగేవి. అతడు భార్యను బాగా కొట్టేవాడు. బరితెగించి శ్వేతను నేరుగా ఇంటికే తీసుకువచ్చేవాడు. అంతటితో ఆగకుండా.. శ్వేతతో కలిసి దిగిన ఫొటోలను తన స్టేటస్‌లలో పెట్టేవాడు. సూర్య ప్రవర్తన రోజు రోజుకు దారుణంగా తయారు అవ్వటంతో దీపిక, సూర్య తల్లి పుష్ప వేరే ఇళ్లు తీసుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు. సూర్య మాత్రం శ్వేతతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. వీరి వ్యవహారం ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు.
శ్వేత డబ్బు కోసం సూర్యను ఇబ్బందిపెడుతూ ఉండేది. ఆస్తి అమ్మి తనకు డబ్బులు ఇవ్వమనేది. శ్వేత మాటలు విని సూర్య తన భార్య తల్లిని ఇబ్బందిపెట్టేవాడు. ఆస్తి అమ్మాలంటూ బలవంతం చేసేవాడు. కానీ, వారు మాత్రం ఆస్తి అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆస్తి అమ్మడానికి ఒప్పుకోలేదన్న కోపంతో సొంత తల్లి, చెల్లి, భార్యను చంపుతానంటూ బెదిరించాడు. మరో వైపు సూర్యకు శ్వేత వేధింపులు ఎక్కువయ్యాయి. సూర్య ఈ వేధింపుల గురించి భార్యకు వాయిస్ మెసేజ్‌లు పంపేవాడు. నిన్న రాత్రి సూర్య, శ్వేత అనుగనహళ్లి ఫామ్‌హౌస్లో కలిసి ఉన్నారు. ఉదయానికి సూర్య అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో శ్వేతకు సంబంధించిన వస్తువులు దొరికినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. సూర్యను శ్వేతే హత్య చేసి ఉంటుందని సూర్య తల్లి పుష్ఫ ఆరోపించింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News