Share News

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:24 AM

Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..
Train Accident

ఉత్తర భారత దేశంలో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు. రైళ్లలో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా రైలు డోరు దగ్గర సెల్ ఫోన్ వాడే వారినుంచి ఫోన్లు లాక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెను విషాదం ఒకటి చోటుచేసుకుంది. ఓ దొంగ రైలు డోరు దగ్గర కూర్చొన్న వ్యక్తి ఫోన్ దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఊహించని విధంగా మొబైల్ ఫోన్ యజమాని రైలు కిందపడిపోయాడు. అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం లోకల్ ట్రైన్ ఎక్కాడు. డోరు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. గౌరవ్ గట్టిగా ఫోన్ పట్టుకోవటంతో ట్రైన్‌లోంచి కిందపడిపోయాడు. అతడి రెండు కాళ్లు రైలు కిందకు వెళ్లాయి. దీంతో కాళ్లపైనుంచి రైలు వెళ్లింది.


ఈ ప్రమాదంలో ఓ కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇక, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలతో రైల్వే ట్రాక్ పక్కన పడున్న గౌరవ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగ కోసం గాలిస్తున్నారు. కాగా, డ్రగ్స్‌కు బానిస అయిన వారు, దొంగల ముఠాలు ఇలా రైలులో ప్రయాణించే వారినుంచి ఫోన్లు దొంగలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

తీవ్ర విషాదం.. పడవ బోల్తా పడి 68 మృతి.. 74 మంది గల్లంతు..

ఐదు యుద్ధాలు ఆపా.. నన్ను అంతమాట అంటావా?

Updated Date - Aug 04 , 2025 | 08:24 AM