Share News

Seat 11A Survivor: అనేక మంది వద్దనుకునే సీట్లో కూర్చుని సేఫ్ అయిన అదృష్టవంతుడు.. ఎలాగో తెలుసా..

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:41 PM

విమానంలో అత్యంత చెత్త సీటుగా ప్రసిద్ధి గాంచిన 11A (Seat 11A Survivor) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే ఇటీవల ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఫ్లైట్ ప్రమాదంలో ఆ సీటులో కూర్చున్న విశ్వశ్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Seat 11A Survivor: అనేక మంది వద్దనుకునే సీట్లో కూర్చుని సేఫ్ అయిన అదృష్టవంతుడు.. ఎలాగో తెలుసా..
Vishwesh Kumar Ramesh seat 11A

గుజరాత్ అహ్మదాబాద్‌లోని విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కి జూన్ 12, 2025 మధ్యాహ్నం బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం లిఫ్ట్ ఆఫ్ తర్వాత కేవలం 30 సెకన్లలో వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు అందులో ఉండగా, 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సీటు నంబర్ 11Aలో కూర్చున్న విశ్వశ్ కుమార్ రమేష్ (Vishwesh Kumar Ramesh) అనే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన కూర్చున్న సీటు (Seat 11A Survivor) గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.


సీటు 11A స్పెషల్

అయితే సీటు 11A అనేది కొన్ని విమానాల్లో విండో లెస్ విండో సీటుగా ప్రసిద్ధి చెందింది. బోయింగ్ 737-900, 900ER మోడళ్లలో సీటు 11Aలో విండో లేదు. ఇది ఎయిర్ కండిషనింగ్ డక్ట్స్ లేదా నిర్మాణ సంబంధిత కారణాల వల్ల జరుగుతుంది. ప్రయాణికులు విండో లేని ఈ సీటు కోసం అదనంగా చెల్లించినా, వాస్తవానికి విండో లేకపోవడంతోపాటు డోర్ దగ్గరగా ఉండటం వల్ల అనేక మంది ఈ సీటును ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపించరు.

11A seat.JPG


అదృష్టం లేదా యాదృచ్ఛికం

సీటు 11A, ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోలో ఉండడం వల్ల, విమానం ప్రమాదానికి గురైన సమయంలో రమేష్‌ బయటపడటానికి అవకాశం ఏర్పడింది. ఆయన మాట్లాడుతూ విమాన ప్రమాదం తర్వాత తన సీటు ఎగిరి దూరంగా పడిపోయిందని, అందుకే తాను బతికినట్లు చెప్పాడు. విండో లేకుండా ఆ సీటు ఉండటం వల్ల దీనిని ఎంచుకునేందుకు అనేక మంది కూడా ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో పలువురు ఆ సీటును వరల్ట్ సీట్ అని చెబుతున్నారు. కానీ అందులోనే కూర్చుని రమేష్ ప్రాణాలతో బయటపడటం విశేషం.


అదృష్టం లేదా దురదృష్టం?

సీటు 11A గతంలో విమాన ప్రయాణికులలో నిరాశను కలిగించేది. కానీ, రమేష్ మాత్రం ప్రాణాలతో బయటపడిన తర్వాత, ఆ సీటు ఇప్పుడు మిరాకిల్ సీటుగా మారిపోయింది. సోషల్ మీడియాలో సీటు 11A ఇప్పుడు అదృష్టం, ఆశ్చర్యానికి ప్రతీకగా మారింది. దీంతో సోషల్ మీడియాలో 11A సీట్ గురించి చర్చిస్తున్నారు. కొంతమంది ఈ సీటును అదృష్టం అని చెబుతుండగా, మరికొందరు మాత్రం జోక్‌లు చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ సీటు గురించి విమానయాన సంస్థలు మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:03 PM