బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:46 AM
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఢాకా, జూన్ 30: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు. కుమిల్లా జిల్లా మురాద్‌నగర్‌లో జూన్ 26న జరిగిందీ దారుణం. బాధితురాలి(21) భర్త దుబాయిలో పనిచేస్తున్నారు. ‘హరిసేవ’ పండుగ సందర్భంగా ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవల మురాద్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చారు. స్థానికుడైన ఫజర్ అలీ(36) వద్ద ఆమె తండ్రి రూ.35 వేలు అప్పు తీసుకున్నారు.
అప్పు తీర్చాల్సిన గడువు ముగియడంతో గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో వారి ఇంటికి ఫజర్ అలీ వచ్చాడు. తలుపు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాడు. ఆమెపై దాడి చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫజర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. తనను కొట్టొద్దంటూ బాధితురాలు వేడుకొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి భారీ ప్రదర్శనలు నిర్వహించారు.