Share News

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:46 AM

Assam Man Baths Milk: భార్య చేసిన పనికి అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు.

Assam Man Baths Milk: భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..
Assam Man Baths Milk

‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. విలన్లు హీరో అర్జున్ మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు. హీరో పరుగులు తీస్తూ మురికి కాల్వలో దూకుతాడు. తర్వాత నడుచుకుంటూ ఓ షాపు దగ్గరకు వస్తాడు. అతడు ఒకరోజు సీఎం అని గుర్తించిన ప్రజలు పాలతో అతడి శరీరాన్ని కడుగుతారు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా.. ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. భార్యతో విడాకులు వచ్చిన సంతోషంలో ఓ వ్యక్తి పాలతో స్నానం చేశాడు. తనకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.


ఈ సంఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్బరి జిల్లా, బరాలియపర్ గ్రామానికి చెందిన మానిక్ అలీ భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రెండు సార్లు ప్రియుడితో కలిసి ఇంటినుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కూతురి భవిష్యత్తు కోసం మానిక్ భార్యను ఏమీ అనలేదు. ఆమెతో కలిసి ఉండటానికే ప్రయత్నించాడు. అయితే, ఆమె మూడో సారి కూడా ఇంటినుంచి పారిపోయింది. ఈ సారి తన వెంట కూతుర్ని కూడా తీసుకెళ్లింది.


దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. విడాకులకు అప్లై చేశాడు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో మానిక్ సంతోషం పట్టలేకపోయాడు. పాలతో స్నానం చేశాడు. ఏకంగా 40 లీటర్ల పాలను తెచ్చుకుని మరీ స్నానం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘ఈ రోజునుంచి స్వేచ్ఛా జీవిని.. నాకు పట్టిన మురికిని కడిగేసుంటున్నాను. నాకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉంది. కొత్త జీవితానికి ప్రతీకగా పాలతో స్నానం చేస్తున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఇతనంటే కందిరీగలకు హడల్.. చేయి పెట్టగానే ఏమైందో చూడండి..

విమాన ప్రమాదం.. బతికినా నరకం తప్పటం లేదు..

Updated Date - Jul 13 , 2025 | 12:00 PM