Jagannath Temple: యువకుడి దుస్సాహసం.. స్పై కెమెరాతో జగన్నాథుడి గుడిలోకి..
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:20 PM
Jagannath Temple: అభిషిత్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. 30 వేల రూపాయలు పెట్టి రేబాన్ కంపెనీకి చెందిన మెటా వేపారెర్ కంటి అద్దాలు కొన్నాడు. ఆ కంటి అద్దాల్లో సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను నేరుగా ఫోన్లకు లేదా సోషల్ మీడియాకు పంపుకోవచ్చు.

ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఓ యువకుడు దుస్సాహసానికి పాల్పడ్డాడు. గుడిలోకి స్పై కెమెరాతో ప్రవేశించాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరించే కుట్ర చేశాడు. అయితే, అతడి ప్లాన్ ఫెయిల్ అయింది. గుడి సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పూరీ జగన్నాథుడి గుడిలో ఫొటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం. అయితే, భువనేశ్వర్‌కు చెందిన అభిషిత్ కర్ మాత్రం ఎలాగైనా గుడిలోని దృశ్యాలను వీడియో తీయాలని అనుకున్నాడు.
ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. 30 వేల రూపాయలు పెట్టి రేబాన్ కంపెనీకి చెందిన మెటా వేఫేరర్ కంటి అద్దాలు కొన్నాడు. ఆ కంటి అద్దాల్లో సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను నేరుగా ఫోన్లకు లేదా సోషల్ మీడియాకు పంపుకోవచ్చు. మంగళవారం అభిషిత్ ఆ కంటి అద్దాలు పెట్టుకుని గుడికి వెళ్లాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తూ ఉన్నాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి అభిషిత్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అప్పుడు అసలు విషయం బయటపడింది. తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. అతడ్ని అరెస్ట్ చేశారు. కంటి అద్దాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పూరీ ఎస్పీ సుశీల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘సీక్రెట్ కెమెరా ఉన్న కంటి అద్దాలతో ఓ వ్యక్తి గుడి దృశ్యాలు చిత్రీకరిస్తున్నాడని మాకు సమాచారం అందింది. మేము ఎంక్వైరీ చేస్తున్నాము. కంటి అద్దాలను స్వాధీనం చేసుకున్నాము’ అని తెలిపారు. ఇక, ఆలయ రూల్స్ ప్రకారం అభిషిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియరావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
చనుబాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్న మహిళ..
ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..