Lovers Track Tragedy: తీవ్ర విషాదం.. కలిసి బతకలేమని భావించిన ప్రేమికులు..
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:38 PM
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ ప్రేమ జంట దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై నిలబడి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది.
బెంగళూరు: కలిసి బతకలేమని భావించిన ప్రేమికులు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 19 ఏళ్ల స్టెర్లింగ్ ఎలిజా షాజీ, 20 ఏళ్ల జస్టిన్ బీఎస్‌సీ చదవటం కోసం కర్ణాటక వచ్చారు. చిక్కబనవారాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. కాలేజీలో ఏర్పడ్డ పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది.
ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే, ఎవరి దిష్టి తగిలిందో తెలీదు కానీ, వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ మానసికంగా చాలా కృంగిపోయారు. కలిసి బతకలేనప్పుడు.. కలిసి చనిపోవటమే మేలనుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం ఉదయం చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం రైలు పట్టాలపై నిలబడ్డారు.
బెంగళూరు నుంచి బెల్గామ్ వెళుతున్న వందే భారత్ రైలు వారిని ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవటం వల్లే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్యకు అదే కారణమా లేక వేరే కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ విద్యార్థులను పట్టుకోవడం ఎవరితరమూ కాదేమో.. ఎలా కాపీ కొడుతున్నారో చూడండి..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..