LIC Clarification: వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ శుద్ధ అబద్ధం: LIC
ABN , Publish Date - Oct 25 , 2025 | 02:59 PM
వాషింగ్టన్ పోస్ట్ తమపై చేసిన ఆరోపణ అబద్ధం, పూర్తిగా నిరాధారమైనదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) క్లారిటీ ఇచ్చింది. సదరు నివేదికలోని అంశాలు సత్యదూరమని పేర్కొంది. తమ కంపెనీ పెట్టుబడి నిర్ణయాలు పూర్తిగా సంస్థ నియమావళి..
న్యూఢిల్లీ, అక్టోబర్ 25 : ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తమపై చేసిన ఆరోపణలు అబద్ధం, పూర్తిగా నిరాధారమైనవని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) క్లారిటీ ఇచ్చింది. సదరు నివేదికలోని అంశాలు సత్యదూరమని పేర్కొంది. తమ కంపెనీ పెట్టుబడి నిర్ణయాలు పూర్తిగా సంస్థ నియమావళి, నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని వెల్లడింది. బయటి వ్యక్తులు తమ సంస్థ పెట్టుబడి అంశాలను ఏమాత్రం ప్రభావితం చేసే అవకాశం లేదని తెలిపింది.
బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం LIC తన పెట్టుబడి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని LIC స్పష్టంగా పేర్కొంది. అలాంటి నిర్ణయాలలో మరే ఇతర సంస్థకు ఎటువంటి పాత్ర లేదని, ఉండదని కూడా LIC తేల్చి చెప్పింది. తమ వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన జాగ్రత్తలను ఎప్పుడూ తీసుకుంటుందని వివరించింది. ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎల్‌ఐసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో శనివారం ఎల్ఐసీ ఓ పోస్ట్ పెట్టింది.
కాగా, LIC నుండి సుమారు USD 3.9 బిలియన్ (రూ. 32,000 కోట్లు) ను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలకు మళ్లించారని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. దీనిపై ఎల్ఐసీ పై విధంగా వివరణ ఇచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించినట్టు అటువంటి డాక్యుమెంట్ లేదా ప్రణాళికను LIC ఎప్పుడూ సిద్ధం చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందంటూ వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఓ కథనం వెలువరించింది. LIC నుండి సుమారు USD 3.9 బిలియన్ (రూ. 32,000 కోట్లు) ను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలకు మళ్లించిందని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. దీనిపై ఎల్ఐసీ పై విధంగా వివరణ ఇచ్చింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టంచేసింది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి