Share News

Pahalgam surfaces horrifying scene: పహల్గాం ఘటన.. పర్యాటకుల కెమెరాలో భయానక దృశ్యం

ABN , Publish Date - Apr 28 , 2025 | 10:08 PM

పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పర్యాటకుడి కెమెరాలో బంధించబడిన భయానక దృశ్యాలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి..

Pahalgam surfaces horrifying scene: పహల్గాం ఘటన.. పర్యాటకుల కెమెరాలో భయానక దృశ్యం
Pahalgam surfaces horrifying scene

Pahalgam surfaces horrifying scene: పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి బయటకొచ్చింది. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతున్నప్పుడు దీనిని ఒక పర్యాటకుడు తన జిప్ లైన్‌లో బంధించాడు. ఇది 26 మందిని బలిగొన్న దాడి యొక్క క్రూరత్వానికి నిలువెత్తు సాక్షిగా మారింది.

అయితే, ఈ వీడియో తీసిన వ్యక్తికి కింద జరుగుతున్న మారణకాండ గురించి అస్సలు తెలియలేదు. రోప్ వే లో ప్రయాణిస్తూ ఆ మధురానుభూతిని ఎంజాయ్ చేస్తున్నాడే తప్ప..కింద ఏం జరుగుతుందన్న విషయంపై ఆయన దృష్టి పెట్టలేదు. అంతేకాదు, తాను ఉగ్రమూక మీదుగా నేరుగా వెళుతున్నానని కూడా ఆయన గ్రహించలేకపోయాడు.

వీడియోలో, ఉగ్రవాదులు కింద ఉన్న జనంపై కాల్పులు జరపడం చూడవచ్చు. ప్రజలు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు పారిపోతుంటే, కొందరు తప్పించుకునే ప్రయత్నంలో కూలిపోయారు. ఇదే ఆ వీడియో..


ఇవి కూడా చదవండి

KCR: జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా కేటీఆర్‌కు గాయం..

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Updated Date - Apr 28 , 2025 | 10:08 PM