Minister KN Nehru: ‘సర్’ ఫారాలను డీఎంకే శ్రేణులు పూరించడం తప్పా..
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:44 PM
తెలియని వారికి ఎస్‌ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44 లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
- ప్రశ్నించిన మంత్రి కేఎన్ నెహ్రూ
చెన్నై: తెలియని వారికి ఎస్‌ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ(Minister KN Nehru) ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో, తిరుచ్చి ముక్కొంబు కావేరి, కొళ్లిడం చెరువుల్లో శుక్రవారం సుమారు 4లక్షల చేపపిల్లలను విడిచే కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అప్పావుతో కలిసి మంత్రి కేఎన్ నెహ్రూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిచ్చారు. సర్‌ను డీఎంకే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, ఎస్‌ఐఆర్ ఫారాలను రాష్ట్రంలోని పలు ప్రాంతంలో డీఎంకే కార్యకర్తలు పూర్తిచేయడంపై సమాధానమిస్తూ తెలియని వారికి ఎస్‌ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు విజయ్ గత నాలుగున్నరేళ్లుగా డీఎంకే ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరిశీలించాలని, అలా చేయకుం డా ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా మాట్లాడడం సరికాదన్నారు.
ఐదు కోట్ల ఎస్‌ఐఆర్ ఫారాల వినియోగం
రాష్ట్రంలో 5 కోట్లకు పైగా ఎస్‌ఐఆర్ ఫారాలను వినియోగించినట్లు ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో గత నెల 27 వరకు సుమారు 6,41,14,587 మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు 5,00,67,045 (78.09శాతం) ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేసినట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రంలో 68,467 పోలింగ్ బూత్‌ల అధికారులు, 2,11,445 మంది బీఎల్‌వోలు ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)పనుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది
Read Latest Telangana News and National News