Delhi Car Bomb Blast Case: ఢిల్లీ కారు బాంబు పేలుడు.. తుర్కియేలో పర్యటించిన ఉగ్ర డాక్టర్లు..
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:00 AM
ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్‌తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న కారు బాంబు బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. కేసుతో సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఎన్‌ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ బాంబు పేలుడుతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఆపరేటీవ్‌తో ఆ ముగ్గురూ భేటీ అయినట్లు తేలింది. ఈ సమావేశాన్ని పాక్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. మరోవైపు అల్-ఫలాహ్ వర్సిటీపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయబడింది.
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్..
పంజాబ్ రాష్ట్రం, లుథియానాలోని ఢిల్లీ-అమృత్‌సర్ హైవేపై ఇద్దరు ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. లాడోవాల్ టోల్ ప్లాజా వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. టోల్ ప్లాజా సమీపంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు గాయపడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో ఉగ్రవాదులిద్దరికీ సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్