Share News

కేదార్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 17 , 2025 | 06:25 AM

కేదార్‌నాథ్‌ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

కేదార్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

రుద్రప్రయాగ, జూన్‌ 16: కేదార్‌నాథ్‌ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ క్రమంలో కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గంలో పడిన కొండచరియలను తొలగించడంతో సోమవారం పునరుద్ధరించారు.


ఈ వారం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సోన్‌ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లే నడక నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Updated Date - Jun 17 , 2025 | 06:25 AM