Share News

Kapil Sibal: ఇందిరాగాంధీ ఉదంతం గుర్తులేదా? జగదీప్ ధన్‌ఖడ్‌కు సిబల్ కౌంటర్

ABN , Publish Date - Apr 18 , 2025 | 06:13 PM

సుప్రీంకోర్టు అథారిటీని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించడంపై కపిల్ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్‌ఖడ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను విచారానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

Kapil Sibal: ఇందిరాగాంధీ ఉదంతం గుర్తులేదా? జగదీప్ ధన్‌ఖడ్‌కు సిబల్ కౌంటర్

న్యూఢిల్లీ: తమిళనాడు బిల్లులను క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గడువులోగా గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు క్లియర్ చేయాలని పేర్కొంది. అయితే సుప్రీం వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ధన్‌ఖడ్ వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) తాజాగా కౌంటర్ ఇచ్చారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్


ఉపరాష్ట్రపతి ఏమన్నారు?

రాష్ట్రపతిని ఆదేశించే విధంగా న్యాయ వ్యవస్థ వ్యహరించడాన్ని జగ్‌దీప్ ధన్‌ఖడ్ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణ ప్రజాస్వామ్య వ్యవస్థలపై న్యూక్లియర్ మిజైల్స్ తరహాలో వాడుతున్నారని ఆరోపించారు. డెడ్‌లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదన్నారు. జడ్జీలే శాసనసభ వ్యవహారాలు చూస్తున్నట్టు, ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమలు చేస్తు్నట్టు, సూపర్ పార్లమెంటును నడిపిస్తున్నట్టు ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇందుకు ఐదు, అంతకుమించి ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని అన్నారు.


తిప్పికొట్టిన సిబల్

సుప్రీంకోర్టు అథారిటీని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించడంపై సిబల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్‌ఖడ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను విచారానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ''దేశవ్యాప్తంగా ప్రజావిశ్వాసం చూరగొన్న సంస్థ ఏదైనా ఉందటే అది న్యాయవ్యవస్థే. రాష్ట్రపతి పదవి అనేది ఒక పొజిషన్ మాత్రమే. క్యాబినెట్ సలహాల మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరిస్తారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండదు'' అని చెప్పారు.


ఇందిరాగాంధీ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం గుర్తు చేసుకోవాలని సిబల్ అన్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, అప్పుడు తీర్పు చెప్పింది కూడా ఒకే ఒక్క జడ్జి.. జస్టిస్ కృష్ణ అయ్యర్ అని వివరించారు. ఆయన ఇచ్చిన తీర్పుతో ఇందిరాగాంధీ సీటు కోల్పోయారని గుర్తు చేశారు. ''అది జగ్దీప్ ధన్‌ఖడ్‌కు మోదయోగ్యమే కానీ, ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం రూలింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు'' అని సిబల్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?

India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Updated Date - Apr 19 , 2025 | 12:30 PM