Share News

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..

ABN , Publish Date - May 20 , 2025 | 03:55 PM

Kanpur Wife: పోలీసులకు మాత్రం ఆమె మీద అనుమానం పోలేదు. రీనా కాల్ డేటాను చెక్ చేశారు. ఆమె సతీష్‌తో గంటలు, గంటలు మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. ఇద్దరూ ఒకరికి ఒకరు అశ్లీల ఫొటోలు సైతం పంపుకున్నారు.

Kanpur Wife: అల్లుడితో ఎఫైర్.. విషయం భర్తకు తెలిసిందని..
Kanpur Wife

పెళ్లి తర్వాత పరాయి వ్యక్తులతో కలిగే ప్రేమలు, ఆకర్షణలు ఎక్కువ శాతం దారుణంగానే ముగుస్తున్నాయి. తాజాగా, ఓ మహిళ అల్లుడితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియటంతో గొడవైంది. దీంతో భర్తను ఆమె హత్య చేసింది. హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి ఫెయిల్ అయింది. ఆ మహిళ, ఆమె ప్రియుడు జైలు పాలయ్యారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, కన్పూర్‌లోని లక్ష్మణ్‌ఖేద గ్రామానికి చెందిన ధర్మేంద్ర పాసి, రీనా భార్యాభర్తలు.


రీనా అల్లుడి వరుసయ్యే సతీష్ అనే యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ధర్మేంద్రకు తెలిసింది. రీనాతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర తమ బంధానికి అడ్డు అవుతాడని ఇద్దరూ భావించారు. చంపటానికి ప్లాన్ చేశారు. మే 10వ తేదీన ధర్మేంద్ర తినే ఆహారంలో రీనా నిద్ర మాత్రలు కలిపింది. అతడు తిండి తిని మత్తులోకి జారుకున్నాడు. డోరు ఫ్రేమ్‌తో రీనా అతడి తలపై బలంగా కొట్టి చంపేసింది. భర్తను చంపిన తర్వాత శవాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చి పడేసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు.


శవం ఇంటి బయట ఉంది. రక్తం ఇంట్లో, వరండాలో, బాత్ రూమ్ దగ్గర కూడా ఉంది. ఇదే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. రీనా మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ అబద్ధం చెప్పింది. తన భర్తను ఓ ముగ్గురు వ్యక్తులు చంపేశారంటూ.. అదే గ్రామానికి చెందిన ముగ్గురి పేర్లు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం ఆమె మీద అనుమానం పోలేదు. రీనా కాల్ డేటాను చెక్ చేశారు. ఆమె సతీష్‌తో గంటలు, గంటలు మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. ఇద్దరూ ఒకరికి ఒకరు అశ్లీల ఫొటోలు సైతం పంపుకున్నారు. ఆ విషయం కూడా బయటపడింది. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. తమ అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసినందుకే చంపేసినట్లు రీనా తెలిపింది. ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

Bhopal Shocker: అమ్మ బాబోయ్.. 7 నెలల్లో 25 మంది మగాళ్లను పెళ్లి చేసుకుంది..

Abhishek-Digvesh: దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్.. ఏదో తేడా కొడుతోంది!

Updated Date - May 20 , 2025 | 03:55 PM