Kangana Ranuat: క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్
ABN , Publish Date - Oct 27 , 2025 | 07:48 PM
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న 73 ఏళ్ల మహిందర్ కౌర్ ఒకటేనంటూ అప్పట్లో కంగన ట్వీట్ చేసారు.
బటిండా: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో జరిగిన రైతు నిరసనల సందర్భంగా మహిందర్ కౌర్ అనే మహిళపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, నటి కంగనా రనౌత్ (Kangana Ranuat) క్షమాపణలు తెలిపారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న 73 ఏళ్ల మహిందర్ కౌర్ ఒకటేనంటూ అప్పట్లో కంగన ట్వీట్ చేసారు. దీనిపై మహిందర్ కౌర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరవుతానని కంగనా చేసిన విజ్ఞప్తిని గత నెలలో కోర్టు తోసిపుచ్చింది. అక్టోబర్ 27న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లఖ్బీర్ సింగ్ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య బటిండా కోర్టు ముందు కంగన సోమవారంనాడు హాజరయ్యారు.
కోర్టు ముందు హాజరైన అనంతరం మీడియాతో కంగన మాట్లాడుతూ, ఫిర్యాదుదారు భర్తకు తాను కోర్టులో క్షమాపణ చెప్పినట్టు తెలిపారు. మహిందర్ కౌర్‌పై చేసిన పోస్టుకు విచారం వ్యక్తం చేశారు. 2021లో రైతుల నిరనసలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో కంగన్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆమె లాంటి మహిళలు రూ.100 ఇస్తే నిరసనల్లో పాల్గొంటారంటూ మహిందర్ కౌర్ ఫోటోను ట్వీట్‌లో పెట్టారు.
ఇవి కూడా చదవండి..
ముస్తఫాబాద్ ఇకపై కబీర్‌ధామ్ .. యోగి ప్రకటన
రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి