Share News

Kamal Hasan: 71ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:04 PM

ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..

Kamal Hasan: 71ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్
Kamal Haasan

ఇంటర్నెట్ డెస్క్: మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఇటీవల రాజ్యసభ(Rajya Sabha) సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇలా పెద్దలసభలో ఎంపీగా ఎన్నికైనప్పుడు తన అనుభూతి ఏమిటని కేరళ(Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించారు. బదులుగా.. ఏడు పదుల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టుగా ఉందని సమాధానమిచ్చారు కమల్. ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పిన ఆయన.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నట్టు వివరించారు.


'ఆ క్షణంలో నా తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్(D Srinivasan Iyengar), రాజ్యలక్ష్మి(Rajalakshmi)లను తలచుకున్నాను. నేను రాజ్యసభకు వెళ్లి సంతకం చేసినప్పుడు వారే గుర్తుకొచ్చారు. నేను స్కూల్లో ఓ డ్రాపౌట్ స్టూడెంట్‌ను. కనీసం ఎస్ఎస్ఎల్సీ(SSLC) పాసైనా.. నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. అలాంటిది 71 ఏళ్ల వయసులో సాధించినట్టుంది. ఆ సమయంలో నా తల్లికి ఫోన్ చేసి.. ప్రభుత్వ కొలువులో పనిచేస్తున్నానని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది.' అని కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ అనుభవాన్ని పంచుకున్నారు.


ఇక, కమల్ తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ.. తనను తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమల్ చివరిసారిగా.. మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వం వహించిన 'థగ్ లైఫ్(Thug Life)' మూవీలో నటించారు. అయితే.. ఆ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.


ఇవీ చదవండి:

సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రెండో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు

Updated Date - Dec 02 , 2025 | 12:18 PM