Share News

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

ABN , Publish Date - May 21 , 2025 | 04:46 PM

తాజాగా జోధ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Little girls Shiv Tandav Stotram

ప్రాణాలను పణంగా పొట్టి దేశ రక్షణ కోసం పోరాడిన భారత సైనికులకు మద్దతు తెలుపుతూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు (Tiranga Yatra) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జోధ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది (Jodhpur Tiranga Yatra). ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని (Shiv Tandav Stotram) భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.


పురాతన సంస్కృత శ్లోకం, శివ తాండవ స్తోత్రాన్ని పూర్తి స్పష్టతతో పఠించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆ బాలిక స్తోత్ర పఠనాన్ని చూసి అక్కడున్న వారందరూ చప్పట్లు, ఈలలతో అభినందించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ పాప తన ప్రతిభను ప్రదర్శించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.4 కోట్ల మంది వీక్షించారు. 22 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆమె నూతన భారతదేశ కుమార్తె, ఎలా సమాధానం చెప్పాలో ఆమెకు తెలుసని ఒకరు కామెంట్ చేశారు. ఆమె ఇస్తున్న సందేశం బిగ్గరగా, స్పష్టంగా ఉంది. ఆమె భవిష్యత్తు ఫ్లయింగ్ ఆఫీసర్ అని మరొకరు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Read Latest National News And Telugu News

Updated Date - May 21 , 2025 | 04:46 PM