JEE Main 2025: జేఈఈ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:13 PM
JEE Main Result 2025: జరుగుతున్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని ఓం ప్రకాశ్ సలహా ఇస్తున్నాడు. అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదట. అది ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని అతడు నమ్ముతాడు. ఓం ప్రకాశ్ సక్సెస్‌లో తల్లిదండ్రుల పాత్ర కూడాఉంది.

కలలు అందరూ కంటారు. కొందరు మాత్రమే వాటిని సాకారం చేసుకుంటారు. మనం అనుకున్నది సాధించాలంటే కష్టపడ్డంతో పాటు క్రమ శిక్షణ కూడా ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. తాజాగా, జేఈఈ పరీక్షల ఫలితాల్లో ఒరిస్సాకు చెందిన ఓం ప్రకాశ్ అనే విద్యార్థి ఫస్ట్ ర్యాంకు కొట్టి రికార్డు సృష్టించాడు. 300 మార్కులకు 300 మార్కులు సాధించి అందిరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ ప్రకాశ్ జేఈఈ పరీక్షల్లో ఇంతటి ఘన విజయం సాధించటం వెనుక అతడి కృషితో పాటు తల్లిదండ్రుల కష్టం కూడా ఉంది. కొడుకు భవిష్యత్తు కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు.
ఓం ప్రకాశ్ సక్సెస్ మంత్ర
ఓం ప్రకాశ్ జేఈఈలో ఇంత అద్భుతమైన సక్సెస్ సాధించడానికి అతడి కష్టంతో పాటు.. మైండ్ సెట్ కూడా ఓ కారణం. నూటికి 90 శాతం మంది జరిగిపోయిన దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. ఓం ప్రకాశ్ గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడ్డం వృధా అంటున్నాడు. జరుగుతున్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నాడు. ఓం ప్రకాశ్ మాట్లాడుతూ..‘ నాకు మొబైల్ ఫోన్ లేదు. అది మన ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని నేను నమ్ముతాను. నేను ప్రతీ రోజు 8 నుంచి 9 గంటలు చదివే వాడ్ని. నేను ప్రస్తుతం అడ్వాన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను‘ అని అన్నాడు.
కొడుకు భవిష్యత్తు కోసం తల్లి త్యాగం
ఓం ప్రకాశ్ బెహరా తల్లి స్మితా రాణి బెహరా ఒడిశా టీచింగ్ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్‌గా పని చేస్తూ ఉండేది. కొడుకు కోసం స్మితా ఉద్యోగం మానేసింది. ఓం ప్రకాశ్ చదువులకోసం ఒరిస్సా రాష్ట్రం వీడింది. అతడితో పాటు రాజస్థాన్‌లోని కోటకు వచ్చి చేరింది. గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. ఓం ప్రకాశ్ తండ్రి కమల్ కాంత్ బెహరా కూడా కొడుకు భవిష్యత్తు కోసం చాలానే కష్టపడ్డాడు. అతడు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నాడు. కొడుకు కోసం ఒరిస్సానుంచి ఢిల్లీకి ఉద్యోగాన్ని మార్చుకున్నాడు. తరచుగా కొడుకు దగ్గరకు వెళ్లి వస్తూ ఉన్నాడు. ఓం ప్రకాశ్‌కు ఎమోషనల్ సపోర్టుగా నిలుస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇదేం బుద్ధి తల్లి.. అన్న వరుసయ్యే వ్యక్తితో మహిళ జంప్
కన్న కొడుకు క్రూరత్వం.. కుక్క కోసం తల్లిని చంపేశాడు..