Vyommitra: డిసెంబరులో అంతరిక్షంలోకి వ్యోమమిత్ర
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:48 AM
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లో..

చెన్నై, జూలై 28(ఆంధ్రజ్యోతి): వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబరులో ముందుగా ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపుతామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ డిసెంబరులో రోబోను నింగిలోకి పంపుతాం. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే ఏడాది మరో రెండు మానవ రహిత (అన్‌క్రూడ్ మిషన్) ప్రయోగాలు చేపడతాం. 2027లో వ్యోమగాములతో కూడిన గగన్‌యాన్ మిషన్ ఉంటుంది’ అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..