ISRO: నింగిలోకి నైసార్ ఉపగ్రహం.. షార్ నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:09 PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది. ఈ వాహక నౌకను తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా ప్రయోగించారు.
నాసా, ఇస్రో కలిసి రూపొందించిన సింథటిక్ ఎపెర్చెర్ రాడార్ (NISAR) ఉపగ్రహం కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లు సమకూర్చింది. అలాగే భారత్ 90 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఈ నైసార్ ఉపగ్రహం అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 2392 కిలోల బరువు గల ఈ ఉపగ్రహం.. జీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 18:59 నిమిషాలకు భూమి నుంచి 747 కిలోమీటర్ల ఎత్తులో విడిపోనుంది.
ఇవి కూడా చదవండి..
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు.. జస్టిస్ యశ్వంత్‌వర్మపై సుప్రీం వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి