Israel: హౌతీలపై ఇజ్రాయెల్ దాడులు
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:06 AM
ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) ఆదివారం సాయంత్రం నుంచి ముప్పేట దాడులు జరిపింది.

దుబాయ్, జూలై 7: ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) ఆదివారం సాయంత్రం నుంచి ముప్పేట దాడులు జరిపింది. ఆదివారం ఉదయం ఎర్రసముద్రంలో లిబేరియన్ జెండా ఉన్న ఓ వాణిజ్య నౌకపై హౌతీలు దాడి చేయడంతో.. ఇజ్రాయెల్ తన చర్యలను ప్రారంభించింది.
దక్షిణ యెమన్‌లోని హౌతీల స్థావరాలైన హోడెదా, రాస్‌ఈసా, సలిఫ్ బందరా, రాస్ కానాటిబ్ పవర్ ప్లాంట్‌లపై సోమవారం కూడా గగనతల దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ‘గెలాక్సీ లీడర్’ నౌకను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. 2023లో భారత్‌కు వస్తున్న ఆ నౌకను హౌతీలు అపహరించారు. దాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన నౌకగా భావించి, అపహరించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.