Share News

Mount Levotobi: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:20 AM

ఇండోనేషియాలోని మౌంట్‌ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలయింది. సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు నిప్పురవ్వలు, దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నాయి.

Mount Levotobi: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

  • 18 కి.మీ ఎత్తుకు ఎగిసిపడుతున్న బూడిద

జకార్తా, జూలై 7: ఇండోనేషియాలోని మౌంట్‌ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలయింది. సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు నిప్పురవ్వలు, దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. అయితే అగ్నిపర్వతం నుంచి విడుదలైన లావా సుమారు 5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని ఇండోనేషియా భూగర్భశాస్త్ర ఏజెన్సీ తెలిపింది.


గతేడాది నవంబర్‌లో లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలు కావడంతో తొమ్మిది మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. గత నెలలోనూ పలుమార్లు అగ్నిపర్వతం బద్దలయింది. దాంతో మరిన్ని పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉన్నందున పర్వతానికి ఏడు కిలోమీటర్ల వరకు అధికారులు ఆంక్షలు విధించి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపారు.

Updated Date - Jul 08 , 2025 | 05:20 AM