Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:28 PM
భారత్ పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం మరో రెండు రోజుల్లోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా - పాక్ బోర్డ్ వెంబడి ఉన్న పంజాబ్ రైతుల పొలాలను వెంటనే కోసేయాలని బీఎస్ఎఫ్..

BSF notice to Punjab farmers: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. త్రివిధ దళాలను రెడీ చేసింది. ఏ క్షణమైనా దాయాది దేశం పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో48 గంటల్లో జీరో లైన్ వెంబడి పొలాలను క్లియర్ చేయండి అని రైతులకు బోర్డర్ సెక్కూరిటీ ఫోర్స్ సూచించింది.
సరిహద్దు భద్రతా దళం జీరో లైన్ వెంబడి ఉన్న రైతులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వేలాది మంది పంజాబ్ రైతులు జీరో లైన్ వెంబడి సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో తమ పొలాలను కలిగి ఉన్నారు. వారు పండించిన పంటలు ఇప్పుడు చాలా వరకూ చేతికందాయి. దీంతో వెంటనే పంటను కోసి ఇళ్లకు తెచ్చుకోవాలని, లేదంటే, నిలువెత్తు పంటల్లో విద్రోహులు దాక్కుని దాడి చేసే ప్రమాదముందని సదరు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో బీఎస్ఎఫ్ దళం వివరణ ఇచ్చింది.
ఇండియా - పాకిస్తాన్ మధ్య 530 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. దీని వెంబడి దాదాపు 45,000 ఎకరాల భూమిని మన రైతులు సాగు చేస్తున్నారు. అమృత్‌సర్‌లోని రౌడా వాలా ఖుర్ద్‌లోని స్థానిక గురుద్వారా కూడా BSF నోటీసుకు సంబంధించి ప్రకటన చేసింది.
రౌడా వాలా ఖుర్ద్ మాత్రమే కాకుండా, తర్న్ తరణ్, ఫజిల్కా, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లోని గ్రామాలలో ఉన్న గురుద్వారాలు కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. గురుద్వారా రైతులు వీలైనంత త్వరగా పంటలు కోయాలని కోరుతున్నాయి. ఎందుకంటే యాక్సెస్ గేట్లు త్వరలో మూసివేయబడతాయని ఆయా గురుద్వారాలు సరిహద్దు ప్రాంత రైతులను అప్రమత్తం చేస్తున్నాయి.
పొలాల్లో ఏపుగా పెరిగిన పంటలు సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నించే విద్రోహుల అడగు జాడల్ని కనిపించకుండా చేస్తాయి. జీరో లైన్ వెంబడి ఉన్న ప్రాంతాలు క్లియర్ గా ఉంటే, కీలకమైన ప్రాంతాల వెంబడి నిఘా పెంచుకునేందుకు మన భద్రతా దళాలకు వీలు చిక్కుతుంది.
Read Also: Indian Navy: మిసైల్స్ పరీక్షలు సక్సెస్.. యుద్ధానికి సిద్ధంగా నావికా దళం..
NIA To Probe Pahalgam Attack: పహల్గాం దాడిపై దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
Hanif Abbasi Threatens India: 130 అణుమిసైళ్లను భారత్ వైపు గురిపెట్టి రెడీగా ఉంచాం: పాక్ మంత్రి