Share News

PM Modi: పాక్‌తో శాంతికి ప్రయత్నిస్తే శతృత్వం, నమ్మకద్రోహమే ఎదురైంది

ABN , Publish Date - Mar 16 , 2025 | 09:51 PM

ఇండియా-పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తూ 2014లో ప్రధానమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్‌ను కూడా ఆహ్వానించానని నరేంద్ర మోదీ చెప్పారు

PM Modi: పాక్‌తో శాంతికి ప్రయత్నిస్తే శతృత్వం, నమ్మకద్రోహమే ఎదురైంది

న్యూఢిల్లీ: పొరుగుదేశమైన పాకిస్థాన్‌ (Pakistan)తో శాంతి కోసం భారత్ ప్రయత్నించినప్పుడల్లా శతృత్వం, నమ్మకద్రోహమే ఎదురైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)అన్నారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ (Lex Fridman) పాడ్‌కాస్ట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ, ఇండియా-పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తూ 2014లో ప్రధానమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్‌ను కూడా ఆహ్వానించానని చెప్పారు. నిబద్ధతో తాము శాంతిని ప్రోత్సహించేందుకు పనిచేసినప్పుడల్లా శత్రుత్వం, నమ్మకద్రోహాన్నే చవిచూశామని తెలిపారు.

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే


పాక్ ప్రజలు కలహాలు, అశాంతితో అశాంతితో అలసిపోయారని, ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పాయారని, వారు కూడా శాంతి కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఇప్పటికైనా ఇస్లామాబాద్ నాయకుల్లో వివేకం మేలుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.


స్కార్ దేశాధినేతలను ఆహ్వానించాం

విదేశాంగ విధానంలో గతంలో తమను ప్రశ్నించిన వారు ఆ తర్వాత సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని ప్రధాని గుర్తుచేశారు. భారత విదేశాంగ విధానం ఎంత పటిష్టంగా ఉందో దానిని బట్టే చెప్పవచ్చన్నారు. శాంతి పట్ల భారతదేశం నిబద్ధతను ప్రపంచదేశానికి చాటామని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు.


చైనాతో..

పోటీతత్వం అనేది మంచే కానీ చెడు కాదని, అయితే పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలేన కానీ సంఘర్షణలకు దారితీయరాదని చైనాతో సంబంధాలపై మోదీ అన్నారు. విభేదాలు వివాదాలు కారాదన్నారు. చర్చలకే తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 09:53 PM