Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది
ABN , Publish Date - Jul 22 , 2025 | 10:37 PM
గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.

ఢిల్లీ, జులై 22: గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 206 శాతం ఎక్కువ. అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
ఆర్థిక మోసాలను వెంటనే చెప్పడానికి, సైబర్ నేరాలను అరికట్టడానికి 2021లో సెక్షన్ ఐ4సీ కింద CFCFRMSను ప్రారంభించినట్లు మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 17.82 లక్షలకు పైగా ఫిర్యాదులు అందగా.. రూ.5,489 కోట్లకు పైగా మొత్తాన్ని రికవర్ చేసినట్టు బండి సంజయ్ చెప్పారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన కేసులు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల పరిధిలోకి వస్తాయని కూడా మంత్రి తెలిపారు.
సైబర్ నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎమ్‌ఈఐ(EMEI)లను కేంద్రం బ్లాక్ చేసిందన్నారు. సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో గతేడాది సెప్టెంబరు 10న సస్పెక్ట్ రిజిస్ట్రీని ప్రారంభించినట్లు మంత్రి గుర్తు చేశారు.
ఇక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023లో సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.7,465.18 కోట్లు నష్టపోయారు.
Also Read:
తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. వైసీపీకి పవన్
దాడి చేస్తే భాష వచ్చేస్తుందా..
ఎన్ని ఇబ్బందులో: డిప్యూటీ సీఎం పవన్
For More Telangana News and Telugu News..