India-Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య.. తీవ్రంగా ఖండించిన భారత్
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:35 PM
హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటిని భారత్ పేర్కొంది.

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ (Bangladesh) లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో హిందూ మైనారిటీ నేత భజేశ్ చంద్ర రాయ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన చేశారు.
India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..
"హిందూ మైనారిటీ నేత భబేశ్ చంద్ర రాయ్‌ను ఇంట్లోంచి అపహరించి, దారుణంగా హత్య చేసినట్టు మా దృష్టికి వచ్చింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఇది మరొకటి. ఈ దాడిని మేము ఖండిస్తు్న్నాం. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని మరోసారి గుర్తుచేస్తున్నాం'' అని రణ్‌ధీర్ జైశ్వాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అపహరణ, హత్య..
కాగా, 58 ఏళ్ల బభేశ్ చంద్ర రాయ్‌ను ఇంటి నుంచి అపహరించి, కొట్టి చంపినట్టు 'డెయిలీ స్టార్' పత్రిక తెలిపింది. ఆ కథనం ప్రకారం, బభేశ్ చంద్రరాయ్ ఇంటికి గురువారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆయన భార్య శాంతన రిసీవ్ చేసుకున్నారు. బబేశ్ ఇంట్లోనే ఉన్నారని ఆమె చెప్పడంతో ఒక అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి బబేష్‌ను తమవెంట నరబరి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై దారుణంగా దాడిచేశారు. స్పృహ కోల్పోయిన దశలో ఇంటికి చేర్చడంతో ఆయనను కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్ బిరాల్ యూనిట్‌కు రాయ్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..