Chhattisgarh: ఏ కాలంలో ఉన్నార్రా.. ఇంత అరాచకమా..
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:07 PM
Chhattisgarh: కాలం మారింది.. పరిస్థితులూ మారాయి.. కానీ కొందరు వ్యక్తుల్లో అహంకారం మాత్రం తగ్గలేదు. యజమానులమనే దురహంకారంతో.. తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంతో..

Chhattisgarh: కాలం మారింది.. పరిస్థితులూ మారాయి.. కానీ కొందరు వ్యక్తుల్లో అహంకారం మాత్రం తగ్గలేదు. యజమానులమనే దురహంకారంతో.. తాము ఏం చేసినా చెల్లుతుందనే అహంతో.. చెలరేగిపోతున్నారు. ఇందుకు నిదర్శనమై ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో వెలుగు చూసింది. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఆ ఫ్యాక్టరీ యజమాని, అతని సహచరులు కలిసి ఘోరంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఫ్యాక్టరీలో చోరీ చేశారనే అనుమానంతో వారి గోళ్లను తీసి, విద్యుత్ షాక్ పెట్టి హింసించారు. ఈ వ్యవహారం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి.. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖప్రభట్టి ప్రాంతంలో చోటు గుర్జార్‌కు చెందిన ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీరిద్దరినీ ఓ కాంట్రాక్టర్ ద్వారా నియమించుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఏప్రిల్ 14న.. కార్మికులిద్దరూ చోరీకి పాల్పడినట్లు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ యజమాని గుర్జార్, అతని సహచరుు ముఖేష్ శర్మ ఆరోపించారు. కార్మికులు దొంగతనం చేశారని ఆరోపిస్తూ.. వారిద్దరి దుస్తులు విప్పించారు అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చారు. వారి గోళ్లను కటింగ్ బ్లేయర్‌తో కట్ చేశారు. ఇలా రకరకాలుగా చిత్ర హింసలకు గురి చేశారు. వీరిని హింసిస్తూ వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితులిద్దరూ తప్పించుకుని భిల్వారాలోని తమ స్వస్థలానికి చేరుకున్నారు. అనంతరం గులాబ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు.. తదుపరి చర్యల కోసం కోర్బా పోలీసులకు సమాచారం అందించారు. రాజస్థాన్ పోలీసులు అందించిన సమాచారంతో.. కోర్బాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో గుర్జార్, ముఖేష్ శర్మలపై కేసు నమోదు చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. బాధితుల్లో ఒకరైన అభిషేక్ భంబి తన వాహనం రిపేర్ కోసం రూ. 20 వేలు అడ్వాన్స్ కావాలని యజమానిని కోరాడు. అందుకు యజమాని నిరాకరించాడు. దీంతో అభిషేక్ తాను ఉద్యోగం మానేస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గుర్జార్.. అభిషేక్‌పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వినోద్ భంబిని సైతం చితకబాదారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. దర్యాప్తు జరుగుతోందని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రమోద్ దడ్సేన తెలిపారు.
Also Read:
అక్షయ తృతీయ గోల్డ్ బదులు ఇవి కొన్నా అదృష్టమే.
సడెన్‌గా కూలిన నాలుగు అంతస్తుల భవనం! షాకింగ్
ఆన్‌లైన్ బుకింగ్‌లో మోసాలు..యాత్రికులకు
For More National News and Telugu News..