Pahalgam Terror Attack: పేలిపోయిన టెర్రరిస్టుల ఇళ్లు
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:25 PM
Pahalgam Terror Attack: ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై రివేంజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్‌కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్, బైసరన్ లోయలో పర్యాటకులపై కొందరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మందిలో 25 మంది ఇండియన్స్ కాగా.. ఒక వ్యక్తి నేపాల్‌కు చెందిన వాడు. దాడి జరిగి మూడు రోజులు దాటింది. నిఘా వర్గాలు, కాశ్మీర్ పోలీసు శాఖ దర్యాప్తు వేగవంతం చేసింది. అధికారులు అనుమానితులను గుర్తించారు. వారిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా.. మిగిలిన ఇద్దరు కాశ్మీర్‌కు చెందినవారు. పుల్వామాకు చెందిన అసిఫ్ షేక్, అనంతనాగ్ బిజ్‌బిహారాకు చెందిన ఆదిల్ తోమర్.. పాకిస్తానీ ఉగ్రవాదులతో కలిసి దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, గురువారం రాత్రి అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అనుమానిత ఉగ్రవాదులు అసిఫ్, ఆదిల్‌ల ఇళ్లు పేలిపోయాయి. ఎవరో బాంబులు పెట్టి ఆ రెండు ఇళ్లను పేల్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాశ్మీర్ పోలీసులు ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల చిత్రాలను సెక్యూరిటీ ఏజెన్సీ విడుదల చేసింది. వారి గురించిన సరైన సమాచారం తెలిపిన వారికి 20 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
భారత్ - పాక్‌ల మధ్య యుద్ద వాతావరణం
ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై రివేంజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్‌కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది. మెడికల్ వీసాలు ఉన్నవారు 29వ తేదీ లోపు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా ఇండియాకు పోటీగా నిర్ణయాలు తీసుకుంటోంది. వ్యాపార సంబంధాలను తెంచేసుకుంది. పాకిస్తాన్‌లో ఉన్న ఇండియన్స్ వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఒకరకంగా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం