Meghalaya Murder: రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు వీడియో.. షాకింగ్
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:10 PM
మేఘాలయ మర్డర్ కేసులో అత్యంత కీలకమైన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు, అతను.. అతని భార్య సోనమ్ కలిసి కొండలెక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి తీస్తున్న వీడియోలో వీరిద్దరూ తారసపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అత్యంత కీలకమైన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త, నవ వరుడు రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు, అతను.. అతని భార్య సోనమ్ (ప్రధాన నిందితురాలు) కలిసి కొండలెక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి తీస్తున్న వీడియోలో వీరిద్దరూ కనిపించారు. మేఘాలయలోని పచ్చని పర్వతాల పైకి ట్రెక్కింగ్ చేస్తున్నట్లు వీరిద్దరూ కనిపించారు.
మే 23న ఉదయం 9:45 గంటల ప్రాంతంలో సోనమ్, రఘువంశీ కొండ ఎక్కడాన్ని ఒక వ్యక్తి చిత్రీకరిస్తున్న వీడియోలో వీరిద్దరూ అనుకోకుండా తారసపడ్డారు. అదే రోజు మధ్యాహ్నం, సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా నియమించుకున్న ముగ్గురు హంతకులు రాజాను హత్య చేసి లోయలో పడేశారు.
ఇక, ఈ వీడియో విషయానికొస్తే, దేవ్ సింగ్ అనే టూరిస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో సోనమ్, రాజా కొండపైకి వెళ్తున్నట్టు కనిపించారు. సోనమ్ ముందు వెళ్తుండగా, రాజా ఆమెను అనుసరిస్తున్నాడు. ఈ వీడియోలో సోనమ్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కనిపించింది. దీనిని మేఘాలయ పోలీసులు నేరస్థలం దగ్గర కనుగొన్న సంగతి తెలిసిందే. ఆమె ఒక పాలిథిన్ బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లింది. దానిలో రెయిన్‌కోట్ ఉందని చెబుతున్నారు. సోనమ్ ముగ్గురు సహచరులు వారిని అనుసరిస్తున్న సమయంలో ఇదే జరిగింది.
ఇవీ చదవండి:
AB de Villiers: ఆ జట్టు నిండా విషపూరిత వ్యక్తులే.. ఐపీఎల్ జట్టుపై డివిల్లీర్స్ సంచలన కామెంట్స్
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి