Share News

Model Murder: కర్కశం.. మోడల్ గొంతు కోసి, కాలువలో పడేశారు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:04 PM

బాధితురాలు శీతల్‌.. స్థానిక ఫోక్ హర్యాన్వి సంగీత పరిశ్రమలో మోడల్‌గా పనిచేసేది. అయితే, ఇంత కిరాతకంగా ఆ యువతని ఎందుకు హత్య చేశారనే దానిపై కారణాలు తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శీతల్‌ తన సోదరి నేహాతో కలిసి ..

Model Murder: కర్కశం.. మోడల్ గొంతు కోసి, కాలువలో పడేశారు
Model Murder

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని సోనిపట్‌ సమీపంలో దారుణం జరిగింది. ఒక యువతిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసి, మ‌ృతదేహాన్ని కాలువలో పడేశారు. సదరు బాధిత యువతిని శీతల్ అనే మోడల్‌గా గుర్తించారు. కొన్ని రోజుల నుంచి శీతల్ కనిపించకుండాపోయింది. ఈమెను కిడ్నాప్ చేసి ఉంటారని శీతల్ కుటుంబ సభ్యులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోని దిగిన పోలీసులు యువతికోసం గాలిస్తుండగా, ఖండా గ్రామ సమీపంలోని కాలువలో శీతల్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

model-seethal.jpg


బాధితురాలు శీతల్‌.. స్థానిక ఫోక్ హర్యాన్వి సంగీత పరిశ్రమలో మోడల్‌గా పనిచేసేది. అయితే, ఇంత కిరాతకంగా ఆ యువతని ఎందుకు హత్య చేశారనే దానిపై కారణాలు తెలియరాలేదు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శీతల్‌ తన సోదరి నేహాతో కలిసి పానిపట్‌లో నివసిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జూన్ 14న, మోడల్ శీతల్.. అహర్ గ్రామంలో షూటింగ్ కోసం వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, బాధితురాలి సోదరి ఓల్డ్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్‌లో తన అక్క ఆచూకీ కోసం పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది.కాగా, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:23 PM