Share News

Gulf Air flight diverted: హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు..

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:23 PM

బహ్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు.

Gulf Air flight diverted: హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు..
flight emergency landing

బహ్రెయిన్‌ (Bahrain) నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని దారి మళ్లించారు (Hyderabad flight diversion).


బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు (Gulf Air Mumbai diversion). అక్కడి అధికారులు విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అందులో బాంబులేదని తేల్చారు. దీంతో విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. బాంబు ఉందని తెలియడంతో విమానంలో ఉన్న 154 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు ఏదీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇలా చనిపోతుందని ఎవరైనా అనుకున్నారా.. ఎద్దుల బండి నడుపుతుండగా..

బొద్దింకలతో కాఫీ.. దీని రేటు, ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2025 | 06:13 PM