Home » Bahrain
బహ్రెయిన్ అల్యూమినియం ప్లాంట్‌పై డ్రోన్ దాడి తామే చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తోందనే ఈ దాడులు చేశామని తెలిపింది.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించాలని మొదట అనుకున్నా చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అధికారులు తెలిపారు.
బహ్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులకు గొప్ప శుభవార్త. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా బహ్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే..
ఇరాన్ తాజాగా బహ్రెయిన్ రాజధాని మేనామలోని జుఫైర్ జిల్లాలోని అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 21 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్టు టెహ్రాన్ టైమ్స్ తెలిపింది.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు.
బహ్రెయిన్‌లోని అమెరికన్ నావల్ బేస్‌పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు.
బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు (Jaya Shankar) లేఖ రాశారు. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య(62) సమస్యను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
గల్ఫ్‌లో అనాథలుగా ప్రాణాలు విడిచిన ప్రవాసీయులకు అక్కడి ఎన్నారైలు అంత్యక్రియలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.