Share News

Top 7 Destinations: ఇండియాలో టాప్ 7 టూరిస్ట్ డెస్టినేషన్స్.. ప్రపంచ అద్భుతాల్ని మైమరపిస్తాయి

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:34 PM

స్విస్ దేశపు శైలి పచ్చిక బయళ్లు మొదలు, మధ్యధరా సముద్రాల వరకు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. అయితే, వాటికి ఏమాత్రం తీసిపోని టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాలోనే ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..

Top 7 Destinations: ఇండియాలో టాప్ 7 టూరిస్ట్ డెస్టినేషన్స్.. ప్రపంచ అద్భుతాల్ని మైమరపిస్తాయి
Top 7 Destinations

స్విస్ దేశపు శైలి పచ్చిక బయళ్లు మొదలు, మధ్యధరా సముద్రాల వరకు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. అయితే, వాటికి ఏమాత్రం తీసిపోని టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాలోనే ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..

ప్రపంచంలోని అద్భుత టూరిస్ట్ ప్లేసెస్ ను మైమరపించే భారతదేశంలోని టాప్ 7 పర్యాటక ప్రాంతాలేంటో చూడండి..


స్విట్జర్లాండ్‌ను తలదన్నే హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజ్జియార్

ఖజ్జియార్‌ను 'మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఇక్కడి పచ్చని పచ్చికభూములు, నిర్మలమైన సరస్సు.. స్విస్ ఆల్ప్స్‌తో పోలిన పైన్ అడవులను తలదన్నేలా ఉంటాయి.

Ep-go6uUUAAsupg.jpegఆస్ట్రియా అనుభూతిని పంచే ఔలి(ఉత్తరాఖండ్)

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్న ఔలి.. ఆస్ట్రియాలోని ప్రకృతి అందాలకు ఏమాత్రం తీసిపోదు. ఇక్కడికి వస్తే, అచ్చం విదేశీ పర్యటన చేస్తున్న అనుభూతి కలుగుతుంది. దాని స్కీ వాలులు, శంఖాకార అడవులు, హిమాలయాల దృశ్యాలు.. యూరోపియన్ స్కీ రిసార్ట్‌లను గుర్తుకు తెస్తాయి.

GFnyb5kbYAAKELE.jpegస్కాట్లాండ్ అందాల్ని మరిపించే కూర్గ్(కర్ణాటక)

కూర్గ్‌ను కొడగు అని పిలుస్తారు. ఇక్కడి భౌగోళిక స్వరూపం, భూభాగం, వాతావరణం అంతా స్కాట్లాండ్‌తో సరిపోల్చుతారు. ఈ రెండు ప్రాంతాలలో పొగమంచుతో కూడిన కొండలు, పచ్చదనం, చల్లని వాతావరణం, ఎత్తైన చెట్లు మంచి అనుభవాల్నిస్తాయి.

0719d7d7-dd19-426b-9e27-de7e5fe451f8-1753781990113.avifదక్షిణ అమెరికాను గుర్తుకు తెచ్చే రాన్ ఆఫ్ కచ్ (గుజరాత్)

రాన్ ఆఫ్ కచ్ గుజరాత్‌లో ఉంది. చంద్రుని కాంతిలో ఈ ప్రదేశాన్ని దర్శిస్తే, ఒక భయానక వాతావారణాన్ని కల్పిస్తుంది. ఇది. అంతులేని బొలీవియా ఎడారి లోని ఉప్పు నీటి చదునుల వలె కనిపిస్తుంది. మీరు రాన్ ఉత్సవ్ సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ దక్షిణ అమెరికా వంటి క్రాస్ఓవర్ వాతావరణాన్ని ఫీల్ అవుతారు.

81309bb4-3613-4846-956b-08e6e0d31fd2-1753782003350.avifఫ్రాన్స్ కు ఏమాత్రం తీసిపోని (పుదుచ్చేరి)

పుదుచ్చేరిని తరచుగా 'లిటిల్ ఫ్రాన్స్' అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ బలమైన ఫ్రెంచ్ వలస వారసత్వం కనిపిస్తుంది. ఫ్రాన్స్ వాస్తుశిల్పం, ఆకర్షణీయమైన వీధులు, అక్కడి సాంస్కృతిక ప్రభావాలలో ఇప్పటికీ అది కనిపిస్తుంది. ఈ నగరం ప్రత్యేక ఫ్రెంచ్ వాతావరణాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా 'వైట్ టౌన్' అని కూడా పిలువబడే ఫ్రెంచ్ క్వార్టర్‌లో ఇదంతా ప్రస్పుటమౌతుంది.

40098347-bf84-4ac7-9732-15e660beee7a-1753782013660.avifమాల్దీవులులకు ఏమాత్రం తీసిపోని అండమాన్, నికోబార్ దీవులు

క్రిస్టల్ క్లియర్ గా ఉండే సముద్రపు నీరు, ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో కూడిన కొండలు, తెల్ల ఇసుక బీచ్‌లు వంటి ఇక్కడి అద్భుతమైన సహజ సౌందర్యం కారణంగా అండమాన్, నికోబార్ దీవులు.. మాల్దీవుల అనుభూతులతో పోటీ పడుతోంది. స్కూబా డైవింగ్ ఇక్కడ స్పెషల్.

cadb3cfe-d4c0-4860-9bdf-c1e168abae3a-1753782025092.avifనయాగరా జలపాతాన్ని పోలిఉండే, చిత్రకూట్ జలపాతం

చిత్రకూట్‌ను తరచుగా భారతదేశ నయాగరా జలపాతం అని అంటారు. గంభీరంగా కనిపించే ఈ ఇక్కడి వాటర్ ఫాల్స్, నయాగారా కంటే కొంచెం చిన్నదిగా ఉన్నప్పటికీ, వర్షాకాలంలో సందర్శించినప్పుడు, దాని పూర్తి వైభవాన్ని చూపిస్తుంది. మీకు విస్మయం కలిగించే అనుభవాన్నిస్తుంది.

5b929d35-56eb-45ed-b882-b5ad69e4d7a7-1753782034824.avif


ఈ వార్తలు కూడా చదవండి..

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు

ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 09:09 PM