OPS: మాజీసీఎం ఓపీఎస్ జోస్యం.. రాష్ట్రంలో మళ్లీ డీఎంకే పాలనే..
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:57 AM
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మళ్ళీ డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుం దని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) జోస్యం చెప్పారు. శివగంగ జిల్లా కాళయార్‌కోవిల్‌లోని స్వాతంత్య్ర సమర యోధులు మరుదుపాండియర్ స్మారక స్థలంలో గురుపూజ సందర్భంగా సోమవారం నివాళులర్పించారు.
చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మళ్ళీ డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుం దని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) జోస్యం చెప్పారు. శివగంగ జిల్లా కాళయార్‌కోవిల్‌లోని స్వాతంత్య్ర సమర యోధులు మరుదుపాండియర్ స్మారక స్థలంలో గురుపూజ సందర్భంగా సోమ వారం నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామంలో మరుదుపాండియర్ల త్యాగం ప్రపంచఖ్యాతి పొందిందని, తన తరఫున మరుదు పాండియర్ల విగ్రహానికి రజత కవచాన్ని కానుకగా సమర్పిం చానని తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ విడివిడిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయని, ఆయా పార్టీల మధ్య ఐకమత్యం కొరవడిందని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే డీఎంకే సునా యాసంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఓపీఎస్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా అన్నాడీఎంకే నుంచి విడిపోయినవారంతా మళ్ళీ విలీనం కావాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు.

పార్టీ కార్యకర్తల ద్వారానే పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయాలని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ నిబంధన అమలు చేశారని, దానిని ఈపీఎస్ తోసిపుచ్చి కొత్త సవరణలు చేసి పది మంది జిల్లా కార్యదర్శుల చేత ప్రతిపాదించుకుని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారని ఓపీఎస్ ఆరోపించారు. ఈ విషయమై తాము కోర్టులో పిటిషన్ వేశామని, ప్రస్తుతం ఈ కేసులో తుది తీర్పు కోసం వేచి ఉంటున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News