Ex-CJI Gavai leaves Car: అధికారిక కారును వదిలి.. రాష్ట్రపతి భవన్ వీడిన మాజీ సీజేఐ
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:42 PM
సుప్రీం కోర్టు మాజీ సీజేఐ తన అధికారిక వాహనాన్ని వదిలి సొంత వాహనంలో ఆయన నివాసానికి బయల్దేరారు. నిబంధనల ప్రకారమే ఆయన నూతన సీజేఐ కోసం ఈ సౌకర్యాలను వదిలేసి వెళ్లినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్.. నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం తనకు కేటాయించిన అధికారిక వాహనాన్ని రాష్ట్రపతి భవన్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ప్రమాణం చేసిన అనంతరం.. జస్టిస్ గవాయ్ తన సొంత వాహనంలో ఆయన నివాసానికి వెళ్లారు.
నవంబర్ 23న పదవీ విరమణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్.. నూతన సీజేఐ ప్రమాణం కార్యక్రమానికి తనకు కేటాయించిన అధికారిక మెర్సిడెస్ బెంజ్ కారులో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం.. ఆ కారును అక్కడే వదిలేశారు. నిబంధనల ప్రకారం.. సీజేఐగా రిటైర్ అయిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలతో పాటు ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే జస్టిస్ గవాయ్.. నూతన సీజేఐ కోసం కారును అక్కడే వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.
సుప్రీం కోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ గవాయ్ తదితరులు హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అంటే 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఇవీ చదవండి: