Recovers 9 mm Cartridges: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. సంఘటనా స్థలంలో దొరికిన 3 కాట్రిడ్జ్‌లు
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:58 AM
ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బాంబ్ బ్లాస్ట్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనా స్థలం దగ్గర తాజాగా మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్‌లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్‌లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు కారు పేలుడు కేసులో రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు. యూనివర్సిటీ, ఉగ్రవాదులకు నిధులపై ఆరా తీస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రదేశంలో అధికారులకు మూడు 9 ఎమ్ఎమ్ కాట్రిడ్జ్‌లు దొరికాయి. వాటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు కాగా.. మరొకటి ఖాళీ షెల్. బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కాట్రిడ్జ్‌లు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశ్యంతో ఆ మూడు కాట్రిడ్జ్‌లను అక్కడ పడేసి పోయారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. జైషే మహ్మద్ మాడ్యూల్‌పై కూడా ఆరా తీస్తున్నారు. ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ అక్రమ మార్గాల ద్వారా 20 లక్షల రూపాయలు అందుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హవాలా డీలర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా మార్గాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ గ్రూపు సభ్యులు 32 కార్లతో బాంబ్ బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందుకోసం నాలుగు కార్లను సేకరించారు. ఐ20తో ఉమర్ ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఆరుగుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరిలో ఫరీదాబాద్‌కు చెందిన కారు డీలర్ కూడా ఉన్నాడు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఐ20 వైట్ కారును అమ్మింది అతడే. బాంబు దాడి జరగడానికి 13 రోజుల ముందే అతడు నిందితుడికి కారు అమ్మాడు. ఇక ఇదే కేసులో ఉమర్ బంధువైన డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తిని దర్యాప్తు బృందాలు కాన్పూర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ డాక్టర్ షాహినాతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇవి కూడా చదవండి
సోడియం లెవెల్స్ స్థిరంగా ఉండాలంటే ఎలాంటి ఆహార తీసుకోవాలి...
పైరసీ కింగ్ పిన్‌గా ఇమ్మడి రవి.. సంచలన విషయాలు వెలుగులోకి..