Mahesh Jirawala: దర్శకుడు మిస్సింగ్.. విమాన ప్రమాదం జరిగిన చోట సెల్‌ఫోన్ సిగ్నల్స్..
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:46 PM
Filmmaker Mahesh Jirawala: విమాన ప్రమాదం కారణంగా 275 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన రోజే బాలీవుడ్ దర్శకుడు మహేష్ జీరావాలా కనిపించకుండా పోయారు.

బాలీవుడ్ దర్శకుడు మహేష్ జీరావాలా కనిపించకుండా పోయారు. అహ్మదాబాద్ విమానం ప్రమాదం జరిగిన రోజే ఆయన కనిపించకుండా పోయారు. 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో విమానంలోని వారు, కాలేజీలోని వారు.. హాస్టల్ పరిధిలో నేలపై ఉన్న వారు కూడా చనిపోయారు. నేలపై ఉన్న 29 మంది విమాన శకలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో మహేష్ కూడా ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహేష్ భార్య హెతల్ కూడా ఇదే అనుమానిస్తోంది. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు ఎవరివో గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. హేతల్ డీఎన్‌ఏ టెస్టుల కోసం తన శాంపిల్స్ ఇచ్చి వచ్చింది. 29 మందిలో తన భర్త ఉండకూడదని దేవుడ్ని ప్రార్థిస్తోంది. అతడు ఇంటికి తిరిగి వచ్చే క్షణం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. హెతల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేశాడు. మీటింగ్ అయిపోయిందని, ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పాడు.
అయితే, ఇంటికి తిరిగి రాలేదు. నేను అతడి ఫోన్‌కు కాల్ చేశాను. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. మిస్సింగ్ కేసు పెట్టాను. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరి సారిగా అతడి ఫోన్ సిగ్నల్ విమాన ప్రమాదం జరిగిన 700 మీటర్ల దూరంలో చూపిస్తోంది. విమాన ప్రమాదం 1.39 గంటలకు జరిగింది. అతడి ఫోన్ 1.40కి స్విచ్ఛాఫ్ అయింది. అతడి ఫోన్, స్కూటర్ కూడా కనిపించటం లేదు’ అని అంది. కాగా, విమాన ప్రమాదం కారణంగా 275 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..
ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..