Fake Interpol Office: నోయిడాలో ఏకంగా నకిలీ అంతర్జాతీయ పోలీసు స్టేషన్
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:20 AM
నకిలీ బ్యాంకులు, నకిలీ కార్యాలయాల తరహాలో నోయిడాలో ఏకంగా నకిలీ అంతర్జాతీయ పోలీసు స్టేషన్, ఇంటర్‌పోల్, ఇంటెలిజెన్స్‌బ్యూరో ...
ఇంటర్‌పోల్ పేరుతో నోటీసులు
నిందితుడు తృణమూల్ మాజీ నేత
న్యూఢిల్లీ, ఆగస్టు 12: నకిలీ బ్యాంకులు, నకిలీ కార్యాలయాల తరహాలో నోయిడాలో ఏకంగా నకిలీ అంతర్జాతీయ పోలీసు స్టేషన్, ఇంటర్‌పోల్, ఇంటెలిజెన్స్‌బ్యూరో (ఐబీ) కార్యాలయాలు వెలిశాయి. వీటిని నిర్వహించిన బివాస్ అధికారి అనే తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేతను, సహకరించిన మరో నలుగుర్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లా నల్‌హతి బ్లాక్ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన బివా్‌సపై పలు కేసులు నమోదు కావడంతో ఢిల్లీ వచ్చేశారు. నోయిడాలో నకిలీ ఐబీ, ఇంటర్‌పోల్ కార్యాలయాలు తెరిచి పశ్చిమ బెంగాల్‌లోని వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించాడు. భూవివాదాల పరిష్కారం, ప్రభుత్వ కార్యాలయా ల్లో పనులు చేయించడం పేరుతో సొమ్ములు వసూలు చేసేవాడు. వారి కార్లకు ఇంటర్‌పోల్ స్టిక్కర్లు అతికించడంలో అతడి కుమారుడు కీలక పాత్ర పోషించాడు. నాలుగు నెలల క్రితం కారుపై బ్లూ బల్బ్‌ను ఏర్పాటు చేసుకొని వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News