Share News

Evil Mother: 6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:52 AM

Evil Mother: పాపం శాన్వి.. తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈనేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్లింది. సోమవారం ఉదయం శాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇళ్లు లాక్ చేసి ఉంది.

Evil Mother: 6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..
Evil Mother

కర్ణాటకలోని హాసన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి 6 ఏళ్ల కూతురి ప్రాణాలు తీసేసింది. చిన్నారిని నీటి టబ్బులో ముంచేసి చంపింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... కర్ణాటక, హాసన్ జిల్లా శివమొగ్గకు చెందిన రఘు, శ్వేత భార్యా భర్తలు. వీరికి 7 ఏళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన నాటినుంచి భార్యాభర్తలకు పడేది కాదు. తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు.


ఈ నేపథ్యంలోనే వారికి కూతురు పుట్టింది. ఆ పాపకు శాన్వి అని పేరు పెట్టారు. ఆ పాప వయసు ప్రస్తుతం 6 సంవత్సరాలు. పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్యా గొడవలు మరింత పెరిగాయి. దీంతో శ్వేత భర్త నుంచి దూరంగా వచ్చేసింది. పుట్టింట్లో ఉంటోంది. పుట్టింటికి వచ్చిన తర్వాత విడాకులకు కూడా అప్లై చేసింది. శ్వేత పుట్టింటికి వెళ్లిన నాటినుంచి రఘు తల్లిదండ్రుల దగ్గరే శాన్వి పెరిగింది. రఘు తన తల్లిదండ్రులు, కూతురికి దూరంగా బెంగళూరుకు సమీపంలోని నేలమంగలలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు.


పాపం శాన్వి.. తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈనేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్లింది. సోమవారం ఉదయం శాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇళ్లు లాక్ చేసి ఉంది. దీంతో ఇద్దరూ కొద్దిసేపు పక్కింట్లో ఉన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్వేత, శాన్విని పొలం దగ్గరకు తీసుకెళ్లింది. కూతుర్ని నీటి టబ్బులో ముంచసాగింది. ఊపిరి ఆడక పాప గట్టిగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు విన్న పక్క పొలాల్లోని రైతులు అక్కడికి పరుగులు తీశారు. వారు అక్కడికి చేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. పాప చనిపోయింది. కూతుర్ని చంపిన తర్వాత తాను కూడా చనిపోవాలని అనుకున్నట్లు శ్వేత గ్రామస్తులకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు శ్వేతను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

నిప్పురవ్వ.. పెను జ్వాలై..

Updated Date - Jun 11 , 2025 | 10:36 AM