Encounter: కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:42 AM
Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది.

ఒడిస్సాలోని కంధమాల్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది. మృతులను కేకేబీఎన్ డివిజిన్‌కు చెందిన మంకు(ఏసీఎం) చందన్ (పీఎం)గా గుర్తించారు. ఇక, ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్, 01 పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బలిగూడ పీఎస్ పరిధిలోని సుకండ గ్రామం సమీపంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, జూన్ 15వ తేదీ తెల్లవారు జామున మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు.. మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందారు. అంతకు కొన్ని రోజుల ముందు బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నర్సింహాచలం అలియాస్ సుధాకర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
మొబైల్ షాపుకు కన్నం వేసి 5 లక్షల విలువైన ఫోన్లు చోరీ..
7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు తప్పవు..