Enforcement Directorate: రాబర్ట్ వాద్రా ఆస్తులు ఈడీ స్వాధీనం
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:11 AM
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(56)కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది.

రూ.37 కోట్లు విలువ చేసే 43 ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా(56)కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకొంది. ఆయన వ్యక్తిగత, కంపెనీలకు చెందిన రూ.37.64 కోట్లు విలువ చేసే 43 ఆస్తులను అటాచ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. హరియాణాలోని షికో్‌హపూర్ గ్రామంలో జరిగిన ఆస్తి అమ్మకంలో నగదు అక్రమ చలామణికి పాల్పడినట్టు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆయనపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.