Share News

Drunk Truck Driver Crashes: మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన ట్రక్ డ్రైవర్.. 14 మంది మృతి..

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:31 PM

దేశ వ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 50 మంది దాకా చనిపోయారు. రాజస్థాన్‌లో ఆదివారం ఓ ప్రమాదం, సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది.

Drunk Truck Driver Crashes: మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన ట్రక్ డ్రైవర్.. 14 మంది మృతి..
Drunk Truck Driver Crashes

రాజస్థాన్: వరుస రోడ్డు ప్రమాదాలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నిన్న(ఆదివారం) రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో ఓ టెంపో కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఈరోజు ( సోమవారం) తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 19మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు సంఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం సంచలనం సృష్టిస్తోంది.


మరో ఘోర ప్రమాదం..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ట్రక్ డ్రైవర్ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రక్కుతో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 14 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రమాదం జరిగిన లోహమండి రోడ్‌లోని ఓ షాపులో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజీ వీడియోలో భీకర దృశ్యాలు ఉన్నాయి. ఆ ట్రక్ అడ్డం వచ్చిన వాహనాన్ని వాయు వేగంతో ఢీకొట్టుకుంటూ వెళ్లి పలువురి ప్రాణాలు తీసింది.


బ్రేకులు వెయ్యని డ్రైవర్..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఓ దారుణమైన విషయం బయటపడింది. ట్రక్ అదుపు తప్పిన తర్వాత ఆ డ్రైవర్ అర కిలోమీటర్ వరకు బ్రేకులు వెయ్యలేదు. అడ్డం వచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూనే వెళ్లిపోయాడు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని విచారిస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఎయిర్ ఇండియా ప్రమాదం.. నరకం చూస్తున్న విశ్వాస్ కుమార్..

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వేళాయె.. సైబీరియన్ పక్షుల రాకపై పవన్ ట్వీట్

Updated Date - Nov 03 , 2025 | 09:49 PM