New Traffic Rules India: ట్రాఫిక్ ఉల్లంఘనులకు రెట్టింపు జరిమానా
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:30 AM
చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వారికి రెట్టింపు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది.

వాహనాల్లో పిల్లలతో వెళ్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే బాదుడే
కేంద్ర చట్టంలో కొత్త ప్రతిపాదనలు
మెరిట్, డీమెరిట్ పాయింట్లు ఇచ్చే యోచన
పాయింట్ల ఆధారంగా వాహన బీమా ప్రీమియంలో హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ, జూలై 20: చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వారికి రెట్టింపు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు మోటారు వాహన చట్టంలో సవరణలను ప్రతిపాదించింది. స్కూల్ బస్సులు, విద్యార్థులను తీసుకెళ్లే ఆటోరిక్షాలు, ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిర్లక్ష్య డ్రైవింగ్‌ను వీడి.. బాధ్యతాయుతంగా మెలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు.. డ్రైవర్ల ఉల్లంఘనలపై మెరిట్, డీమెరిట్ పాయింట్ల విధానాన్ని కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించే డ్రైవర్లకు పాజిటివ్(మెరిట్), ఉల్లంఘనులకు నెగటివ్(డీమెరిట్) పాయింట్లు ఇస్తారు. డీమెరిట్ పాయింట్లు గరిష్ఠ స్థాయికి చేరితే.. సదరు డ్రైవర్ లైసెన్సును సస్పెండ్ లేదా రద్దు చేస్తారు. మెరిట్, డీమెరిట్ పాయింట్లను బీమా ప్రీమియంతో లింక్ చేయాలనే ప్రతిపాదన కూడా తాజా ముసాయిదాలో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News