Share News

Himachal Pradesh: 67 మందిని కాపాడిన భౌభౌ

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:59 AM

భారీ వర్షాలతో అతలాకులతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ పెంపుడు కుక్క అరుపు 67మందిని కాపాడింది.

Himachal Pradesh: 67 మందిని కాపాడిన భౌభౌ

మండి, జూలై 8: భారీ వర్షాలతో అతలాకులతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ పెంపుడు కుక్క అరుపు 67మందిని కాపాడింది. జూన్‌ 30న అర్ధరాత్రి సియతి గ్రామంలో నరేంద్ర అనే వ్యక్తి ఇంట్లో కుక్క పెద్దగా అరవడం ప్రారంభించింది. నిద్రలేచిన నరేంద్ర వెళ్లి చూడగా.. గోడకు పెద్ద పగుళ్లు ఏర్పడి, ఇంట్లోకి నీరు వస్తున్నాయి. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి, అందరినీ నిద్రలేపానని నరేంద్ర తెలిపారు. ఆ తర్వాత గ్రామంలోని ఇతరులను కూడా నిద్రలేపి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పానన్నారు. అలా వారు వెళ్లారో లేదో.. కొద్దిసేపటికి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి..

Updated Date - Jul 09 , 2025 | 08:10 AM