Alcohol: దీపావళి ‘కిక్కు’.. మూడు రోజుల్లో రూ.790 కోట్ల మద్యం విక్రయాలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:10 AM
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో మూడు రోజుల్లో రూ.790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ జరుపుకున్నారు.
చెన్నై: దీపావళి(Diwali) పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 4,829 మద్యం దుకాణాల్లో మూడు రోజుల్లో రూ.790 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగ జరుపుకున్నారు. దీపావళి, పొంగల్, నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి పండుగల రోజుల్లో సాధారణం కంటే రెండు, మూడింతలు అధికంగా మద్యం నిల్వ ఉంచుతుంటారు. దీపావళి పండుగ సందర్భంగా రూ.790 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

గత ఏడాది దీపావళి సందర్భంగా రూ.438 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగగా, ఈ ఏడాది రూ.600కోట్ల మేర మద్యం విక్రయించాలని టాస్మాక్ సంస్థ లక్ష్యం పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యాన్ని దాటి రూ.789కోట్ల 85లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ నెల 18న రూ.230కోట్ల 6లక్షలు, 19న రూ.293కోట్ల 73లక్షలు, దీపావళి రోజున రూ.266కోట్ల 6లక్షలు మొత్తం రూ.789కోట్ల 85లక్షల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News