Chess World Cup: వారిద్దరూ దేశానికి గర్వకారణం
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:51 AM
ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలు..

గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌కు సీఎం అభినందనలు
కోనేరు హంపి పోరాట ప్రతిభ ప్రశంసనీయమన్న చంద్రబాబు
దివ్యకు అభినందనలు తెలిపిన భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి
అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన తొలి భారతీయురాలు దివ్య దేశ్‌ముఖ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘భారతమాత ముద్దుబిడ్డలు ఇద్దరు చూసిన అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణంగా నిలిచింది. టోర్నమెంట్ పొడవునా కోనేరు హంపి చూపిన పోరాట ప్రతిభ ప్రశంసనీయం.’ అని పేర్కొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా దివ్య దేశ్‌ముఖ్‌ను అభినందించారు. ‘భారతదేశ 88వ గ్రాండ్ మాస్టర్‌గా ఎంపికైన దివ్యకు హృదయపూర్వక అభినందనలు. భారతదేశ చెస్ భవిష్యత్తు గతంలో కన్నా ఉజ్వలంగా అభివృద్ధి చెందుతోంది’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కూడా దివ్యకు అభినందనలు తెలిపారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి కూడా దివ్యను అభినందించారు. టైటిల్ కోసం చివరి వరకూ కోనేరు హంపీ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారని అన్నారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..