Dharmasthala case: దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు.. తవ్వకాల్లో బయటపడుతున్న శవాలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:12 PM
ధర్మస్థల.. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్. నా చేతులతో నేను కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చిపెట్టాను. అందులో వివస్త్రలైన మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. అంటూ..

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం బయటపడతాయో అనే దాని గురించే యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. దీనిపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) దర్యాప్తు ముమ్మరం చేసింది. జులై 3వ తేదీన మంగళూరు దగ్గరలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన సంగతి తెలిసిందే. అంతలా అతనిచ్చిన ఫిర్యాదులో ఏముంది అంటే..
'నా చేతులతో నేను కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చిపెట్టాను. అందులో వివస్త్రలైన మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను' అంటూ ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొనడమే దీనికి కారణం.
అందరి చూపు ఒకే చోట!
దీంతో బెంగళూరు ప్రభుత్వం ధర్మస్థల ఘటనలపై సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తుకుఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ధర్మస్థలలో మొన్నటి నుంచి కొనసాగుతోంది. మూడో రోజైన ఇవాళ(గురువారం) మృతదేహాలు పాతిపెట్టినట్లు చెప్పిన ప్రాంతాల్లో, ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని దగ్గర పెట్టుకుని తవ్వకాలు సాగిస్తున్నారు. ఫిర్యాదుదారుడు చెప్పిన 15 ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. నేడు నాలుగు ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు జరుపుతోంది. మొదటి రోజు ఓ ప్రాంతంలో, రెండో రోజు నాలుగు ప్రాంతాల్లో ఇప్పటికే తవ్వకాలు జరిపారు.
ఆరు నుంచి ఏడు అడుగుల మేర తవ్వకాలు చేపట్టామని సిట్ అధికారులు చెబుతున్నారు. 5 ప్రాంతాల్లో ఇప్పటివరకూ తవ్వకాలు జరిపినా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే, ఇవాళ ఈ కేసులో బ్రేక్ త్రూ వచ్చింది. ఇవాళ ధర్మస్థలలో 6వ పాయింట్ వద్ద అస్థిపంజరం లభ్యం కావడంతోపాటు, కొన్ని మానవ అవశేషాలు లభ్యం కావడంతో మరింత లోతుకు తవ్వేందుకు నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు.
భారీ భద్రత మధ్య మూడో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. చిన్నపాటి యంత్రాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సమక్షంలో 30 మంది కూలీలతో తవ్వకాలు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి