DGP: హెల్మెట్ ధరించకుంటే సస్పెన్షన్
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:16 PM
పోలీస్ సిబ్బందికి డీజీపీ షాక్ ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ.. హెల్మెట్ ధరించకుంటే సస్పెన్షన్ వేటు వేస్తామంటూ హెచ్చరించారు. కాగా... డీజీపీ ఆదేశాలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేదని జరిమానాలు విధించే ముందు తామే ఆ నిబంధనలు పాటించాలని ఉత్తర్వులు జారీచేయడం హర్షదాయకం.

- సిబ్బందిని హెచ్చరించిన డీజీపీ
చెన్నై: హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలపై వెళ్ళే పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్(Director General of Police Shankar Jiwal) ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు, వెనుక కూర్చుని వెళ్ళేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన అమలులో ఉన్నవిషయం తెలిసిందే! హెల్మెట్ ధరించని వారికి ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. వరుసగా మూడుసార్లు హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న పోలీసులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నారని పలువురు డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమించి పోలీసులు వాహనాలు నడుపుతున్న దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో కొంతమంది అప్‌లోడ్ చేయడం పోలీసు శాఖ పేరు ప్రతిష్ఠతలకు భంగం వాటిల్లేలా వుంది. ఇదిలా వుండగా, రాష్ట్రంలోని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు, ఎస్పీలకు సోమవారం ఓ సర్క్యులర్ జారీచేశారు.
ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం జరిగే రోల్‌కాల్‌లో, ద్విచక్రవాహనాల్లో వచ్చే పోలీసులు తమ ఉన్నతాధికారులకు హెల్మెట్ చూపించాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా విధులకు హాజరయ్యే పోలీసుల వాహనాల తాళాలను స్వాధీనం చేసుకోవాలని, ఐఎస్ఐ హెల్మెట్ కొనుగోలు చేసిన రసీదు చూపించాకే తాళాలు అప్పగించాలని సూచించారు. ఇక నాలుగు చక్రాల వాహనాల్లో వెళ్ళేపోలీసులు సీట్‌బెల్ట్ ధరించాలని, లేనిపక్షంలో వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
Read Latest Telangana News and National News